థియేటర్లలో రూ.1800 కోట్ల కలెక్షన్లు.. ఈరోజే ఓటీటీలోకి ‘ధురంధర్ 2!

  • రాత్రి 7 గంటలకు జియో హాట్‌స్టార్ వేదికగా 'ధురంధర్ 2' డిజిటల్ ప్రీమియర్
  • రేపటి నుంచి అందుబాటులోకి రెగ్యులర్ స్ట్రీమింగ్
  • హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ధురంధర్ 2: ది రివెంజ్’ ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. థియేటర్లలో రూ. 1800 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లతో సంచలన విజయం సాధించిన ఈ చిత్రం, ఈరోజు సాయంత్రం నుంచే డిజిటల్ వేదికపైకి రానుంది. భారత్‌లో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘జియో హాట్‌స్టార్’ వేదికగా ఈ రోజు రాత్రి 7 గంటలకు ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ ప్రదర్శితం కానుంది, అలాగే జూన్ 5 నుంచి ఈ చిత్రం రెగ్యులర్ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉంటుంది.


థియేటర్లలో కట్ చేసిన కొన్ని సీన్స్, అన్‌ఫిల్టర్డ్ డైలాగ్స్‌తో కూడిన ప్రత్యేక వెర్షన్ కట్‌ను భారత్‌లో జియో హాట్‌స్టార్ స్ట్రీమింగ్ చేస్తుండటం విశేషం. దీనికి ముందు సాయంత్రం ఒక 30 నిమిషాల బిహైండ్-ది-సీన్స్ ప్రీ-షో కూడా ఉండనుంది. ఇక విదేశాల్లోని సినీ అభిమానుల కోసం ఈ మూవీ ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ వేదికగా అందుబాటులోకి వచ్చింది.

ఆదిత్య ధార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హై-వోల్టేజ్ స్పై థ్రిల్లర్‌లో రణ్‌వీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి భారీ తారాగణం నటించారు. థియేటర్లలో మిస్ అయిన వారు లేదా మరోసారి ఈ యాక్షన్ విజువల్ ఫీస్ట్‌ను ఎంజాయ్ చేయాలనుకునే వారు ఈరోజు సాయంత్రం నుంచి ఓటీటీలో చూసేయొచ్చు.


Dhurandhar 2
Bollywood
OTT

More Telugu News